News August 13, 2025

TODAY HEADLINES

image

* అతిభారీ వర్షాలు.. సెలవులు రద్దు: రేవంత్
*TG: 5 జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు
* అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు
* ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్
* పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేయాలి: జగన్
* తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు
* తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
* ఏపీలో వార్ 2, కూలీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు

Similar News

News August 13, 2025

‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

image

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అభినందనలు. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News August 13, 2025

విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

News August 13, 2025

భారీ వర్షాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనిత

image

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆదివారం వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసరమైతే 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. GNT, NTR, కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లను ఆమె అప్రమత్తం చేశారు.