News August 13, 2025

కామారెడ్డి: ఈ నెల 14న ఇంటర్వ్యూలు

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో జిల్లా ఉపాధి కల్పనాధి కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

Similar News

News April 17, 2026

ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

image

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.

News April 17, 2026

సింగరేణిపై గల్ఫ్ సెగ.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

image

గల్ఫ్ యుద్ధ పరిణామాలతో సింగరేణి సంస్థకు ముడిసరుకు కష్టాలు మొదలయ్యాయి. బ్లాస్టింగ్ మెటీరియల్‌, డ్రిల్ రాడ్లు, డిటొనేటర్ల దిగుమతి నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, సవరించిన రేట్ల ప్రకారం ఒప్పందాలు చేసుకుంటేనే సరఫరా చేయగలమని కాంట్రాక్టర్లు Way2Newsకు వివరించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు, సరుకు సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.