News August 13, 2025

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: నారా రోహిత్

image

రామచంద్రపురం బైపాస్ పసలపూడి జంక్షన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సినీ నటుడు నారా రోహిత్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని రోహిత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

విధుల పట్ల అంకితభావంతో ఉండాలి: ADB SP

image

పోలీసు సిబ్బంది అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం సెట్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సిబ్బందికి మార్గదర్శనం చేశారు. యూనిఫామ్‌ తప్పనిసరిగా ధరించాలని, ఎండాకాలం దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కృషిని అభినందిస్తూ.. రికార్డుల నవీకరణ, బాధితులతో మర్యాదపూర్వక ప్రవర్తన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

News April 18, 2026

ముండూరులో భూగర్భ జలమట్టాలను పరిశీలించిన కలెక్టర్

image

ముండూరులో శనివారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన రెండు ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాలను టెలిమీటరీ విధానంలో ఆమె స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 72 పిజోమీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మార్చి నెలలో జిల్లా సగటు నీటిమట్టం 21.23 మీటర్లు ఉండగా, ముండూరులో ప్రస్తుతం 23.38 మీటర్లుగా నమోదైందని వివరించారు.

News April 18, 2026

‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

image

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>