News August 13, 2025
ADB: ALERT.. 72 గంటలు భారీ వర్షాలు

ఉమ్మడి ADBలో ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున NPDCL పరిధిలోని జిల్లాల విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

కోచ్ నావల్‌సింగ్ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.
News April 18, 2026
జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>
News April 18, 2026
భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.


