News August 13, 2025

పోడూరు తహశీల్దార్‌కి కలెక్టర్ అభినందనలు

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.లక్ష డ్రాఫ్ట్‌ను అందించిన పోడూరు తహశీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అభినందించారు. తహశీల్దార్లందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి రెడ్ క్రాస్‌కు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Similar News

News August 14, 2025

భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 14, 2025

పేరుపాలెం బీచ్ మూసివేత

image

పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి.వాసు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఎవరూ బీచ్‌కు రావొద్దని స్పష్టం చేశారు.

News August 14, 2025

జిల్లాలో భారీ వర్షాలతో అప్రమత్తం

image

రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299181 ను సంప్రదించవచ్చు.