News August 13, 2025

HYD: ఔటర్ ఆదాయం.. రూపాయల్లో రాబడి.. పైసల్లో కిరాయి..!

image

రూపాయల్లో ఆదాయం వస్తోంటే.. కిరాయి మాత్రం పైసల్లో.. ఇదీ HYD ఔటర్ రింగ్ రోడ్డు లీజు తీరు. 2023 ఆగస్టు 11 నుంచి ఐఆర్బీ సంస్థకు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు ఔటర్ లీజుకిచ్చింది. అయితే ఔటర్ ఆదాయం ఎంత వస్తోందో తెలుసా.. ఈ సంవత్సరం జూన్ వరకు రూ.414 కోట్లు వచ్చాయి. అంటే నెలకు సుమారు 70 కోట్లు.. 30 ఏళ్లకు రూ.25,200 కోట్లు (ఇప్పటి వాహనాల సంఖ్యకు).. ఇక వాహనాలు పెరిగితే.. వామ్మో డబ్బే.. డబ్బు..!

Similar News

News April 16, 2026

ఆ రోజు BIG DAY.. KCR VS రేవంత్ రెడ్డి

image

ఏప్రిల్ 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా, ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.

News April 16, 2026

HYD: బోరు బండి కార్మికుల ప్రాణాలతో చెలగాటమా!

image

నగరంలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నారు. వేసవిలోనూ వందల ఫీట్లు తవ్వుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఈ లారీపై పనిచేసే UP, బిహార్, ఒడిశా కార్మికులకు రక్షణ కరవవుతోంది. వీధుల్లో కరెంటు వైర్లు చేతులతో పట్టుకుంటున్నారు. ఇంటి, బండి యజమానులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే తుర్కయంజల్‌లో కొత్తిల్లు నిర్మిస్తుండగా కరెంటు తీగ తగిలి ఓ కార్మికడు మృతి చెందాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

News April 16, 2026

HYD: జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

image

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్‌కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.