News August 13, 2025

భద్రాద్రి: మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, వాటితో నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ IDOC కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న NDPS కేసులతో పాటు, గంజాయి సాగు నివారణ చర్యలపై సమీక్షించారు. విద్యార్థులు, యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News April 19, 2026

జగిత్యాల: క్రీడా కోర్సులకు ప్రవేశ పరీక్షలు

image

క్రీడా రంగంలో ఉన్నత విద్యను అందించే ఎల్.ఎన్.ఐ.పి.ఇ (LNIPE) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. డిప్లొమా, బీపీడ్, ఎంపీడ్, స్పోర్ట్స్ సైన్స్, జర్నలిజం వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని జిల్లా క్రీడల అధికారి రవి కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.lnipe.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 19, 2026

ఈ ఏడాదే ₹1.85 లక్షలకు 10గ్రా బంగారం?

image

ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.85 లక్షలకు చేరే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, లోకల్ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరిగాయని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే మంచి లాభాలను ఇస్తోందని నివేదిక తెలిపింది.

News April 19, 2026

ఆదిలాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఏఎస్పీగా ఉన్న పి.మౌనికను అదే జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా వనపర్తి అడిషనల్ ఎస్పీగా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ భైంసా ఏఎస్పీగా బదిలీ అయ్యారు.