News August 13, 2025

పాఠశాల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: నంద్యాల కలెక్టర్

image

పాఠశాల విద్య అభివృద్ధి రాష్ట్ర, దేశ అభివృద్ధికి పునాది అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి స్కూలింగ్, బిల్డింగ్ బ్లాక్ వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News August 13, 2025

Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

image

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.

News August 13, 2025

జిల్లాలో జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News August 13, 2025

నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

image

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.