News August 13, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం భూషణరావుపేటలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడానికి చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News August 13, 2025
జగిత్యాల: ఒకే వేదికపై ఎమ్మెల్యే, మాజీమంత్రి

జగిత్యాల MLA సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. జీవన్ రెడ్డి సోదరుడు, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కూతురు వివాహ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి MLA సంజయ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. దీంతో అవాక్కవడం అందరివంతైంది.
News August 13, 2025
కృష్ణానదిలో ఇద్దరి యువకుల గల్లంతు

ఇసుక తోడే డ్రెజర్ స్థానం మార్చేందుకు తాడేపల్లి సీతానగరానికి చెందిన ముగ్గురు యువకులు నదిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటన తుళ్లూరు (M) ఉద్దండరాయునిపాలెంలో చోటుచేసుకుంది. కామేశ్వరావు(19), వీర ఉపేంద్ర(22) కొట్టుకెళ్లగా వెంకటేశ్వర్లు సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు కొండమోడు వద్ద పోతులవాగులో వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. కృష్ణా నదికి వరద నీరు వస్తుండటంలో ప్రజలు ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News August 13, 2025
Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.