News August 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 13, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.43 గంటలకు
✒ ఇష: రాత్రి 7.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News August 13, 2025

‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

image

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అభినందనలు. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News August 13, 2025

విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

News August 13, 2025

భారీ వర్షాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనిత

image

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆదివారం వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసరమైతే 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. GNT, NTR, కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లను ఆమె అప్రమత్తం చేశారు.