News August 13, 2025

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News August 14, 2025

SR నగర్: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష

image

SR నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఈనెల 6న పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురు ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్లను బుధవారం నాంపల్లి కోర్టు 12 జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని వెల్లడించారు. వారికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2,100 జరిమానా విధించారని పేర్కొన్నారు.

News August 13, 2025

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: హైదరాబాద్ కలెక్టర్

image

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. బుధవారం నాంపల్లిలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలను వివరిస్తూ, నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.

News August 13, 2025

కాచిగూడ: ఐక్యతను పెంచేందుకే ‘హర్ ఘర్ తిరంగా’

image

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్‌పురలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని నిర్వహించారు. గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ జె.అచ్యుతాదేవి, నంద గోపాల్ పాల్గొన్నారు.