News August 13, 2025
ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News August 13, 2025
రూ. 56 లక్షల ఆస్తులు అటాచ్ చేశాం: SP

ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులు అరెస్ట్ అయిన ఒడిశా వాసి నగేశ్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ.56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా అథారిటీ పరిధిలో ఉన్నాయని, ఎవరు కొనుగోలు చేసినా చెల్లవన్నారు.
News August 13, 2025
కాసిపేట: అప్పుల బాధకు లారీ డ్రైవర్ ఆత్మహత్య

కాసిపేట మండలం సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ MD.రంజాన్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని SI ఆంజనేయులు తెలిపారు. లారీ నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రంజాన్ కొత్త లారీ కొని అప్పుల పాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో ప్రమాదం జరిగింది. కుటుంబీకులతో చెప్పి బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News August 13, 2025
శ్రీలంక కాలనీ❎.. కొలను✅

జన్నారం మండలంలోని శ్రీలంక కాలనీ కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైంది. కాలనీలో రోడ్డుకిరువైపులా మురుగునీటి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి చేరి, నడవడానికి వీలు లేకుండా తయారైంది. కాలనీవాసులు ఇళ్లలోనుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.