News March 31, 2024

ఏప్రిల్ నెలాఖరులో టెన్త్ ఫలితాలు!

image

TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగియగా, కొన్ని మైనర్ సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం వరకు జరగనున్నాయి. టెన్త్ పరీక్షలకు సుమారు 5.08 లక్షల మంది హాజరయ్యారు.

Similar News

News October 6, 2024

మాది పొయ్యి వెలిగించే హిందూత్వ.. బీజేపీదేమో: శివసేన UBT

image

తమ హిందూత్వ ఇంట్లో పొయ్యి వెలిగిస్తే BJP హిందూత్వ ఏకంగా ఇంటికే నిప్పు పెడుతుందని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అందుకే శివసేనను ఫినిష్ చేయాలనుకున్నారని ఆరోపించారు. మరో నెలలోనే మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ద్రోహులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేసిన తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.

News October 6, 2024

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

image

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.

News October 6, 2024

18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

image

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు