News August 13, 2025
ఆగస్టు 13: చరిత్రలో ఈ రోజు

1888: టెలివిజన్ రూపకర్త జాన్ బైర్డ్ జననం
1899: హాలీవుడ్ డైరెక్టర్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ జననం
1926: క్యూబా నియంత ఫిడేల్ కాస్ట్రో రుజ్ జననం
1933: సినీ నటి వైజయంతి మాల జననం
1963: సినీ నటి శ్రీదేవి జననం
1975: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ జననం
1994: సినీ నటుడు రావు గోపాలరావు మరణం
*ప్రపంచ అవయవ దాన దినోత్సవం
*ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
Similar News
News August 14, 2025
భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

APలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఏమైనా సమస్య వస్తే గుంటూరు-0863-2234014, పల్నాడు- 08647-252999, NTR-8181960909, 0866-2427485, అల్లూరి-08864-243561, అనపర్తి-9441386920, బిక్కవోలు-9849903913, గోకవరం-9491380560, కొవ్వూరు-9866778416, రాజమండ్రి-0883-2416005, రాజానగరం-9494546001, సీతానగరం-9177096888, కాకినాడ-0884 2356801 నంబర్లకు ఫోన్ చేయండి.
News August 14, 2025
రాష్ట్రంలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు

TG: పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు DGP జితేందర్ తెలిపారు. తొలి దశలో 80 మంది పోలీసులు పనిచేయనున్నారని చెప్పారు. అనంతగిరి, రామప్ప, సోమశిల, నాగార్జునసాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులకు వీరు రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
News August 14, 2025
పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ సిటీలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేయడంతో ముగ్గురు మరణించారని, 60 మందికి పైగా గాయాలపాలైనట్లు Geo News వెల్లడించింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని పేర్కొంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపింది. కాగా గత JANలోనూ ఈ తరహా కాల్పుల్లో 42 మంది చనిపోయినట్లు సమాచారం.