News August 13, 2025
ఏటూరునాగారం: 4 రోజులు వర్షాలు.. ఏఎస్పీ సూచనలు!

రాబోయే 4 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కోరారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితులకు స్థానిక పోలీస్ స్టేషన్, డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News April 19, 2026
అల్లికలతో వ్యసనాలకు చెక్!

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.
News April 19, 2026
రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.
News April 19, 2026
కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <


