News August 13, 2025

ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు కామారెడ్డి మహిళలు

image

ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు మహిళా స్వయం సహాయక సంఘం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్ పతి దీదీ పథకం కింద రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళలకు ఈ అవకాశం లభించగా, వారిలో ముగ్గురు కామారెడ్డి జిల్లా వారే కావడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వారిని అభినందించారు.

Similar News

News August 13, 2025

చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

image

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.

News August 13, 2025

MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2025

నిర్మల్: రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లను సన్మానం

image

జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా.చంద్రశేఖర్‌రెడ్డిని కలెక్టర్ అభిలాష అభినవ్ ఘనంగా సన్మానించారు. ఈయనతో పాటు రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్‌లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి ఉన్నారు.