News August 13, 2025

నాగిరెడ్డిపేట: జిల్లాలో రూ.95 కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం

image

డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి రుణాల బకాయిలను సకాలంలో చెల్లించాలని జిల్లా స్త్రీ నిధి జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ సూచించారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో ఆయన పర్యటించారు. బకాయిలను సకాలంలో చెల్లిస్తే మరిన్ని రుణాలు అందజేస్తామన్నారు. జిల్లాలో రూ.95 కోట్ల రుణాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని కిరణ్ కుమార్ చెప్పారు.

Similar News

News April 17, 2026

మెదక్ జిల్లాకు రెండు డయాలసిస్ కేంద్రాలు

image

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 59 ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా.. మెదక్ జిల్లాలోని రామాయంపేట, కౌడిపల్లి కేంద్రాలకు అనుమతులు లభించాయి. త్వరలోనే ఐదు పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. దీంతో కిడ్నీ బాధితులకు స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందనున్నాయి.

News April 17, 2026

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ నిషాంతి

image

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిషాంతి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శుక్రవారం పాడేరులో రైజింగ్ స్టార్స్ పేరుతో సత్కారించి బహుమతులు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఏడుగురు, KGBV.ల నుంచి నలుగురు, ప్రభుత్వం జూనియర్ కళాశాలల నుంచి నలుగురికి ఈ సత్కారం లభించింది. పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

మెదక్: కార్మికుల కొత్త వేతన ఒప్పందం ఖరారు: CITU

image

సీఐటీయూ చొరవ, కార్మికుల ఐక్యతతోనే మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై శుక్రవారం సంగారెడ్డి లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంతకాలు పూర్తయ్యాయి. పాత ఒప్పందం మార్చి 31తో ముగియగా, కొత్త ఒప్పందం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.