News August 13, 2025
VKB: ‘భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News August 13, 2025
కన్నెగంటి హనుమంతు: పుల్లరి సత్యాగ్రహ అమర వీరుడు

స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు(1870-1922) ఉమ్మడి గుంటూరు(D) దుర్గి(M) కోలగట్లలో జన్మించారు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి, ప్రజలతో కలిసి పుల్లరి సత్యాగ్రహం చేశారు. బ్రిటిష్ జనరల్ TG రూథర్‌ఫర్డ్ ఆదేశాలతో ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నించారు. డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసినా ఆయన నిరాకరించారు. FEB 26, 1922న బ్రిటిష్ సైన్యం ఆయనను 26 తూటాలతో కాల్చి చంపింది.
News August 13, 2025
ఆచార్య ఎన్.జి.రంగా: భారత రైతాంగ ఉద్యమ పిత

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలులో నవంబరు 7, 1900న జన్మించారు. ఆయనను భారత రైతాంగ ఉద్యమ పితగా పరిగణిస్తారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. ఆరు సార్లు జైలుకు వెళ్లారు. 1930-1991 వరకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1991లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. జూన్ 9, 1995న మరణించారు.
News August 13, 2025
తుమ్మల సీతారామమూర్తి: తెలుగులెంక

ఆధునిక పద్య కవులలో ప్రముఖులైన తుమ్మల సీతారామమూర్తి (1901-1990) ఉమ్మడి గుంటూరు జిల్లా కావూరులో జన్మించారు. ఆయన ‘తెలుగులెంక’, ‘అభినవ తిక్కన’ బిరుదులు పొందారు. గాంధీ అనుచరుడైన తుమ్మల 1922లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయన ‘మహాత్మకథ’, ‘ఆత్మకథ’ వంటి ప్రౌఢ కావ్యాలు రచించారు. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, 1985లో డీలిట్ వంటి సన్మానాలు పొందారు. 1990 మార్చి 21న మరణించారు.