News August 13, 2025
సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.
Similar News
News August 13, 2025
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

AP, TGలో కుండపోత వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు TGలోని జగిత్యాల, హనుమకొండ, WGL, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, MDK, మంచిర్యాల, VKB జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఆదేశాలను స్కూళ్ల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని కలెక్టర్లు, DEOలు హెచ్చరించారు. అటు APలోని గుంటూరు, NTR, బాపట్ల, ప.గో జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉండనుంది.
News August 13, 2025
ఈ తీర్పు BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు: KTR

TG: గవర్నర్ కోటా MLCల ఎన్నికపై <<17393463>>సుప్రీంకోర్టు తీర్పు<<>> BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని KTR అన్నారు. ‘గతంలో BRS పంపిన MLC ప్రతిపాదనలకు BJP అడ్డుపడింది. ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News August 13, 2025
అలా అయితే భారత్‌పై ట్రంప్ సుంకాలు ఎత్తేస్తారా!

రష్యా చమురు కొంటున్నందుకే భారత్‌పై 25% అదనపు సుంకాలు వేశామన్న ట్రంప్ మున్ముందు సంకట స్థితిని ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మనం ఫండింగ్ చేస్తున్నామన్నదే ఆయన ఆరోపణ. మరికొన్ని రోజుల్లో అలస్కాలో పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. అక్కడ సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు భారత్ చమురు కొంటే USకు అభ్యంతరం ఉండదా? సుంకాలు నిలిపేస్తుందా? మరో సాకు చెబుతుందా? అనేది వేచిచూడాలి.