News August 13, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు నోటీసులు: డీఈవో

వర్క్ అడ్జెస్ట్మెంట్ ఉత్తర్వులు తీసుకుని విధుల్లో చేరని 9 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 31 మంది ఉపాధ్యాయులు రిలీవ్ చేయని ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు కూడా మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మెమోలు అందుకున్న ఉపాధ్యాయులు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News April 17, 2026
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

TGE-JAC పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి PRC, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.


