News August 13, 2025
MHBD కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. దీంతో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803ను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.
Similar News
News August 13, 2025
జగిత్యాల : రేపు యథావిధిగా పాఠశాలలు

భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం బంద్ పాటించాయి. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో గురువారం యథావిధిగా పాఠశాలలను గురువారం నడిపించాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ తెలిపారు. దీంతో రేపు పాఠశాలలను యథావిధిగా నడిపించనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి.
News August 13, 2025
వీధికుక్కల తరలింపు తీర్పుపై సుప్రీం పునరాలోచన!

ఢిల్లీలో వీధికుక్కల తరలింపు ఆదేశాలపై విమర్శలు వ్యక్తమవడంపై సుప్రీంకోర్టు పునరాలోచించనుంది. ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీలోని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పుపై సినీ, రాజకీయ, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
News August 13, 2025
గురజాడ స్వగృహంలో దుశ్చర్య.. నివేదికలో అంశాలు ఇవే..!

విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ స్వగృహంలో ఓ వ్యక్తి చేసిన విధ్వంసంపై కలెక్టర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి గురజాడ ఇంటిని సందర్శించారు. మద్యం మత్తులో చేసినట్లు ఆయన గుర్తించారు. గురజాడ కుటుంబ సభ్యుల సూచనలతో ఐరెన్ రైలింగ్, పోలీస్ పెట్రోలింగ్, వెనుక భాగంలో కందకం లోతు పెంపు, సీసీ కెమెరాల ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేశారు.