News August 13, 2025

VKB: 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాలతో రాబోవు 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చోట పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News August 13, 2025

పేద విద్యార్థుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ: APC మమ్మీ

image

పేద విద్యార్థుల ఉచిత విద్యకు నోటిఫికేషన్ విడుదల చేశామని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మమ్మీ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లను ఉచితంగా కేటాయించాల్సి ఉందని చెప్పారు.

News August 13, 2025

MBNR: డిగ్రీ, PGలో అడ్మిషన్లు.. నేడే లాస్ట్

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు నేడు చివరి తేదీ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

News August 13, 2025

MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిఘా

image

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. MBNR-10,904, NGKL-8,525, WNPT-6,538, GDWL-6,488, NRPT- 5,233 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36,224 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్నారు.