News August 13, 2025
పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.
Similar News
News August 13, 2025
ఈ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు

TG: అతిభారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరో 3 జిల్లాల్లోని స్కూళ్లకు <<17387525>>సెలవులు<<>> ప్రకటించారు. జగిత్యాల (D)లో నేడు, రేపు.. ఆసిఫాబాద్(D)లో ఇవాళ ఒక్కరోజు స్కూళ్లకు సెలవులిస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ ఉట్నూర్ ITDA పరిధిలోనూ ఇవాళ ఒక్క రోజు హాలిడే ప్రకటించారు. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున పిల్లలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
News August 13, 2025
ఒక దాత హృదయం ఎప్పటికీ ఆగిపోదు!

అన్ని దానాల కన్నా అవయవదానం ఎంతో గొప్పది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని అవయవాలు మరికొంతమందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలవు. కానీ ఎవరూ ఇందుకు ముందుకు రాకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అందుకే ఇకనైనా మీలో ఉన్న సందేహాలను వదిలేసి NOTTO, జీవన్‌దాన్ పోర్టల్ ద్వారా అవయవదానానికి ప్రతిజ్ఞ చేయండి. డొనేట్ చేసిన విషయాన్ని తప్పకుండా కుటుంబసభ్యులకు తెలియజేయండి. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.
News August 13, 2025
APPLY: ఇండియన్ నేవీలో 1,266 జాబ్స్

ఇండియన్ నేవీ 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంటుంది. నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు <