News August 13, 2025
హౌసింగ్ శాఖలో సెక్రటరీగా రామాలయ ఈవో

భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆమెను ఆర్ అండ్ బీ శాఖకు కేటాయించిన పోస్టింగ్ ఇవ్వలేదు. మంగళవారం హౌసింగ్ శాఖలో సెక్రటరీగా పోస్టు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామాలయ ఈవోగా ఇంకా ఎవరినీ నియమించలేదు.
Similar News
News April 18, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.
News April 18, 2026
TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

TCS నాసిక్ క్యాంపస్‌లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్‌ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
News April 18, 2026
సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకుని మోసం.. నిందితుడి అరెస్ట్

కార్లను బాడుగకు తీసుకుని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకుని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


