News August 13, 2025

గుంటూరు: అత్యాచారయత్నం కేసులో 5 ఏళ్ల జైలు

image

2020 ఫిబ్రవరి 4న ఐనవోలు గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం, అక్రమ ప్రవేశం చేసిన కేసులో నులకపేటకి చెందిన బలిమి తిరుపతి రావు(60)పై కేసు నమోదైంది. విచారణ పూర్తి చేసిన గుంటూరు IV అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి-ఎస్సీ/ఎస్టీ కోర్టు ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1,200 జరిమానా విధించింది. తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

Similar News

News August 14, 2025

భూధార్ నంబ‌ర్ల కేటాయింపుపై అధికారులకు CM ఆదేశాలు

image

TG: భూముల‌కు భూధార్ నంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో స్వీక‌రించిన వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌ ద‌రఖాస్తుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాలని సమీక్ష సమావేశంలో సూచించారు. కోర్ అర్బ‌న్ ఏరియాలో కొత్తగా నిర్మించ‌నున్న 10 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో పార్కింగ్‌, క్యాంటీన్‌, ఇత‌ర మౌలిక వ‌స‌తులు ఉండేలా చూడాల‌న్నారు.

News August 14, 2025

మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

image

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.

News August 14, 2025

బాసర ఆర్జీయూకేటీలో మాదకద్రవ్యాలపై అవగాహన

image

బాసరలోని ఆర్జీయూకేటీలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలను వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.