News August 13, 2025
భారీ వర్షాలు.. HYD వాసులకు పోలీసుల సూచనలు

☛15వ తేదీ వరకు వర్ష సూచన
☛సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం
☛అత్యవసరం ఉంటేనే బయటకురావాలి
☛వెదర్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోండి
☛వాహనాల కండీషన్ పరిశీలించండి
☛నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్త
☛వర్షంలో చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర నిలబడొద్దు
NOTE: జాగ్రత్తలు పాటించండి.. క్షేమంగా గమ్యం చేరండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News August 14, 2025
HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునే వారికి మరో అవకాశం

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పలు రకాల సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్టు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను www.braouonline.in సంప్రదించాలని సూచించారు.
News August 14, 2025
HYD: ఏమండోయ్ ఇది విన్నారా?

పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం షాకయ్యారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడంతో ముక్కున వేలేసుకున్నారు. నిబంధనలు పాటిస్తోన్న షాపులే లేవా? అని ఆలోచనలో పడ్డారు. మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News August 14, 2025
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్‌లో రాకపోకలు బంద్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT