News August 13, 2025
NLG: భారీ వర్షాలు.. అధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 72 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 14, 2025
నల్గొండ: క్రీడా పాఠశాలకు 14 మంది విద్యార్థులు ఎంపిక

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
నల్గొండ: ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉత్తమ్ విడియో కాన్ఫరెన్స్

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించవద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో జీవో నం. 45 ప్రకారం నిధులు వినియోగించుకోవాలన్నారు. కాలువ కట్టలు తెగే సూచనలు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాన్నారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
News August 14, 2025
NLG: 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (రెవెన్యూ), జిల్లా సర్వే అధికారి జి.సుజాత తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్, ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకోవాలన్నారు.