News August 13, 2025
నందిగామ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోగల కృష్ణానది పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో బాలకృష్ణ సూచించారు. ఎగువ ప్రాజెక్టు నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు విడుదల అవుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 7893053534ను సంప్రదించాలన్నారు.
Similar News
News August 14, 2025
స్వాతంత్ర్య వేడుకల కవాతు రిహార్సల్స్ పరిశీలించిన SP

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్‌ను SP జి.కృష్ణకాంత్ పరిశీలించారు. పెరేడ్ బాగుందని, ఇదే స్పూర్తితో రేపు కూడా పెరేడ్ రెట్టింపు ఉత్సాహంతో చేయాలన్నారు. జెండా వందనానికి విచ్చేసే ముఖ్య అతిథి, అతిథులు గౌరవార్ధం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
News August 14, 2025
నల్గొండ: క్రీడా పాఠశాలకు 14 మంది విద్యార్థులు ఎంపిక

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
SRSP UPDATE: 45.758 TMCలకు చేరిన నీటిమట్టం

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం 45.758 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 13,910 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,713 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.