News August 13, 2025
నిజామాబాద్: బీటెక్ విద్యార్థిని సూసైడ్

HYD నార్సింగి PS పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న సుస్మిత(19) ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్‌లోనే ఉరేసుకుని చనిపోయింది. సుస్మిత స్వస్థలం నిజామాబాద్ జిల్లా అక్కునూరుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలా..?, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 19, 2026
ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News April 19, 2026
హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.
News April 19, 2026
SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.


