News August 13, 2025
కామారెడ్డి: ‘4 నెలల్లో 2,300 కేసుల పరిష్కారం’

ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర సమాచార కమిషన్ గత నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న 18,000 కేసులలో 2,300కు పైగా కేసులను పరిష్కరించిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ మోహ్సినా పర్వీన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన RTI అవగాహన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె RTI చట్టం అమలుపై అధికారులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
Similar News
News August 14, 2025
స్వాతంత్ర్య వేడుకల కవాతు రిహార్సల్స్ పరిశీలించిన SP

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్‌ను SP జి.కృష్ణకాంత్ పరిశీలించారు. పెరేడ్ బాగుందని, ఇదే స్పూర్తితో రేపు కూడా పెరేడ్ రెట్టింపు ఉత్సాహంతో చేయాలన్నారు. జెండా వందనానికి విచ్చేసే ముఖ్య అతిథి, అతిథులు గౌరవార్ధం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
News August 14, 2025
నల్గొండ: క్రీడా పాఠశాలకు 14 మంది విద్యార్థులు ఎంపిక

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
SRSP UPDATE: 45.758 TMCలకు చేరిన నీటిమట్టం

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం 45.758 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 13,910 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,713 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.