News August 13, 2025
SRPT: భారీ వర్షం.. ఇల్లు కూలింది

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిన ఘటన గరిడేపల్లి మండలం గారకుంటతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన గుగులోతు హాంసలీ ఇల్లు గత రాత్రి వర్షానికి పూర్తిగా కూలిపోయింది. తమది నిరుపేద కుటుంబమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.
Similar News
News April 15, 2026
ఉపాధి పనుల జోరు.. అగ్రస్థానంలో జగ్గసాగర్..!

జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. బుధవారం మెట్‌పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో 276 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు అత్యధికంగా హాజరై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 256మంది కూలీలు హాజరై జిల్లాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో 243 మంది కూలీలు హాజరై జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచిందని ఉపాధి హామీ అధికారులు ప్రకటించారు.
News April 15, 2026
NZB: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వర్సిటీ ఉపకులపతి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ టి. సంపత్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
News April 15, 2026
నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.


