News August 13, 2025
వచ్చే నెల ట్రంప్‌తో మోదీ భేటీ?

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Similar News
News August 14, 2025
IPL.. ఆ జట్టుకు బిగ్ షాక్

IPLలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 2026 సీజన్‌కు ముందు బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మెంటార్ కంటే పెద్ద రోల్ మరొకరికి ఇవ్వాలని LSG ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు జహీర్ ఖాన్ రోహిత్ శర్మను కలిసినట్లు ప్రచారం జరుగుతుండటంతో MI జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News August 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 14, 2025
శుభ సమయం (14-08-2025) గురువారం

✒ తిథి: బహుళ పంచమి ఉ.6.10 వరకు
✒ నక్షత్రం: రేవతి ఉ.11.39 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: ఉ.9.22-ఉ.10.52, మ.3.22-4.52