News August 13, 2025
మల్లికార్జున శర్మ: స్వాతంత్ర్య సమరయోధుడు

పండితారాధ్యుల మల్లికార్జున శర్మ(1910-1950) స్వాతంత్ర్య సమరయోధుడు. ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో జన్మించారు. 1931-32లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఖద్దరు అమ్ముతూ జాతీయోద్యమాన్ని ప్రచారం చేశారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కార్మిక సంఘాలను స్థాపించారు. తన ఆస్తిని అమ్మి పార్టీకి విరాళం ఇచ్చారు. 1950లో పోలీసుల చిత్రహింసల కారణంగా మరణించారు.
Similar News
News April 16, 2026
పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: ఎస్పీ

అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో SP జగదీష్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష జరిగింది. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, మట్కా, బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నైట్ సేఫ్టీ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
News April 16, 2026
పాలమూరు: ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

అయిజ మండలం తూముకుంటలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున్(37) వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి రంగమ్మ (75) ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. తల్లి కొడుకు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అతడికి భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 16, 2026
ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 5-7, 15-17 ఏళ్ల విద్యార్థుల ఆధార్ నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 17,501 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో శిబిరాలు నిర్వహించి, 24 గంటల్లో సవరణలు చేయాలని అధికారులకు సూచించారు.


