News August 13, 2025
తుమ్మల సీతారామమూర్తి: తెలుగులెంక

ఆధునిక పద్య కవులలో ప్రముఖులైన తుమ్మల సీతారామమూర్తి (1901-1990) ఉమ్మడి గుంటూరు జిల్లా కావూరులో జన్మించారు. ఆయన ‘తెలుగులెంక’, ‘అభినవ తిక్కన’ బిరుదులు పొందారు. గాంధీ అనుచరుడైన తుమ్మల 1922లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయన ‘మహాత్మకథ’, ‘ఆత్మకథ’ వంటి ప్రౌఢ కావ్యాలు రచించారు. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, 1985లో డీలిట్ వంటి సన్మానాలు పొందారు. 1990 మార్చి 21న మరణించారు.
Similar News
News August 14, 2025
భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.
News August 14, 2025
సింగూరు డ్యామ్‌కు డేంజర్ బెల్స్: KTR

సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్‌కు డేంజర్ బెల్స్ మోగాయని కేటీఆర్ ఆరోపించారు.
News August 14, 2025
పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

PDPL- మంథని ప్రధాన రహదారిలోని గంగాపురి స్టేజీ వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో వెంకటేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ముత్తారం రోడ్డు నుంచి మంథని- PDPL రహదారి మీదుగా రావడానికి గంగాపురి క్రాసింగ్ వద్దకు అతడు రాగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. ఈ మలుపు వద్ద ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు.