News August 13, 2025
కన్నెగంటి హనుమంతు: పుల్లరి సత్యాగ్రహ అమర వీరుడు

స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు(1870-1922) ఉమ్మడి గుంటూరు(D) దుర్గి(M) కోలగట్లలో జన్మించారు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి, ప్రజలతో కలిసి పుల్లరి సత్యాగ్రహం చేశారు. బ్రిటిష్ జనరల్ TG రూథర్‌ఫర్డ్ ఆదేశాలతో ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నించారు. డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసినా ఆయన నిరాకరించారు. FEB 26, 1922న బ్రిటిష్ సైన్యం ఆయనను 26 తూటాలతో కాల్చి చంపింది.
Similar News
News August 14, 2025
ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

1947: విభజన గాయాల సంస్మరణ దినం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం
News August 14, 2025
NLG: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 26 ఏళ్ల జైలు

నల్గొండలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గ్యారల శివశంకర్‌కు 26 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ తీర్పుతో ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఒక హెచ్చరికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News August 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.