News August 13, 2025

పర్వతనేని వీరయ్య చౌదరి: ఆంధ్ర శివాజీ

image

పర్వతనేని వీరయ్య చౌదరి (1886-1970) ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో జన్మించారు. ఆయనను ‘ఆంధ్ర శివాజీ’, ‘దక్షిణ బార్టోలి నాయకుడు’ అని కీర్తించారు. ఆయన పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రజలలో దేశభక్తిని నింపారు. విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు. 1970లో మరణించారు. ఆయన విగ్రహాన్ని పెదనందిపాడు ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు.

Similar News

News April 18, 2026

HYD: అత్తాపూర్ RDOకు నెలరోజుల జైలు

image

రాజేంద్రనగర్ మం. అత్తాపూర్ RDOకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించింది. పెద్ద షాపూర్‌లోని 74 ఎకరాల భూ వివాదంలో ఉత్తర్వూలు జారీ చేయడంలేదని యూసుఫుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. సూచించిన టైమ్‌కి ఉత్తర్వూలు జారీ చేయలేదని తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకుంటే 2వారాలు శిక్ష పొడిగించాలంది. ఆప్పీల్‌కు వీలుగా తీర్పు అమలను 2వారాలు నిలిపేసింది.

News April 18, 2026

నీటి వనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత: మంత్రి సవిత

image

నీటి వనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని మంత్రి సవిత అన్నారు. పెనుకొండలోని భోగసముద్రం చెరువులో జలం–జీవం అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రత కార్యక్రమం శనివారం చేపట్టారు. మంత్రి సవిత పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. జలం ఉంటేనే జీవం ఉంటుంది అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.

News April 18, 2026

ఎల్లారెడ్డిపేట: ఎనిమిది రోజులు గడిచినా.. చిక్కని ‘ఏటీఎం’ దొంగలు!

image

ఎల్లారెడ్డిపేటలో ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన ఘటన జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నా.. దొంగల ఆచూకీ మాత్రం మిస్టరీగానే మారింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు పది బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీలన్నింటినీ జల్లెడ పడుతున్నా, ఈ దుశ్చర్యకు పాల్పడింది ఏ రాష్ట్రానికి చెందిన ముఠా అనే విషయంలో స్పష్టత రాలేదు.