News August 13, 2025
గుంటూరు ప్రజలకు కమిషనర్ సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కి అడ్డుగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా 08632345103, 104,105 నంబర్‌లకు సమాచారం అందించాలని చెప్పారు.
Similar News
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.


