News August 13, 2025

శ్రీశైలం డ్యాం.. మరో రెండు గేట్లు ఎత్తివేత

image

శ్రీశైలం డ్యాం మరో రెండు గేట్లు ఎత్తి మొత్తంగా 6 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ద్వారా 1,51,951 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాదిలో మే నెలలోనే శ్రీశైలానికి వరద ప్రారంభం కావడంతోపాటు మూడవసారి గేట్లను తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేయటం విశేషం.

Similar News

News August 14, 2025

భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

image

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.

News August 14, 2025

సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్: KTR

image

సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్ మోగాయ‌ని కేటీఆర్ ఆరోపించారు.

News August 14, 2025

పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

PDPL- మంథని ప్రధాన రహదారిలోని గంగాపురి స్టేజీ వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో వెంకటేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ముత్తారం రోడ్డు నుంచి మంథని- PDPL రహదారి మీదుగా రావడానికి గంగాపురి క్రాసింగ్ వద్దకు అతడు రాగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. ఈ మలుపు వద్ద ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు.