News August 13, 2025
భువనగిరి: అపోహలు పటాపంచలు.. ఎనిమిది మందికి పునర్జన్మ

అవయవదానం చేయడానికి సాధారణంగా ఎవరూ ముందురు రారు. మూఢనమ్మకాలతో వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయట్లేదు. పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకొస్తున్నారు. భువనగిరికి చెందిన మెతుకు సతీశ్ 2021లో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు సతీష్ అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవ దినోత్సవం.
Similar News
News August 14, 2025
హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
News August 14, 2025
నిర్మల్: నష్టం జరగకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News August 14, 2025
నిర్మల్: ‘కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’

భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గరించి వివరించారు. కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను (9100577132) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.