News August 13, 2025
భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.
Similar News
News August 13, 2025
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: పొంగులేటి

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం సూచనల మేరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
News August 13, 2025
ఖమ్మం జిల్లాలో 575 మి.మీ వర్షాపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో నేడు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వర్షాపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మధిరలో 66.5 మి.మీ, వేంసూరు 59.2, కూసుమంచి 52.3, బోనకల్ 49.5, ఎర్రుపాలెం 40.7, ముదిగొండ 38.6 మి.మీ. వర్షం పడింది. తక్కువగా సింగరేణిలో 3.4, తల్లాడలో 3.2 మి.మీ. నమోదైంది. మొత్తం 21 మండలాల్లో 575 మి.మీ నమోదైందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News August 13, 2025
ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం ముదిగొండ, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరం, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.