News August 13, 2025
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆదోనికి చెందిన లక్ష్మన్న ఎమ్మిగనూరులో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా బుధవారం వేకువజామున కోటేకల్-ఆరేకల్ గ్రామాల మధ్యలో ఉన్న కోళ్లఫారం దగ్గర బైక్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News August 14, 2025
కర్నూలు: అక్కడ బహిర్భూమికి వెళ్తే రూ.2,000 జరిమానా

కర్నూలు జిల్లా ఆస్పరిలోని చెరువులో బహిర్భూమికి వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయరాజు, సర్పంచ్ మూలింటి రాధమ్మ హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. నిబంధన అతిక్రమించిన వారికి రూ.2,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చెరువు నుంచి బోర్లకు మంచినీరు వస్తుందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
News August 14, 2025
విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యం అవసరం: కర్నూలు కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం అందిస్తే ఏ దేశంలో అయినా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్’ అంశంపై జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో డీఈఓ శామ్యూల్ పాల్‌తో కలిసి పాల్గొన్నారు. వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించేందుకు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
News August 13, 2025
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ అధికారులతో ఆయన బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రెండు మూడు రోజులుగా అధిక వర్షపాతం నమోదయిందన్నారు.