News August 13, 2025

సందిగ్ధంలో కొత్వాల్‌గూడ పార్క్: KTR

image

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సేవపై కాదు, రాజకీయాలు, ప్రచారంపై మాత్రమే ఫోకస్ చేసిందని KTR విమర్శించారు. 13 నెలల క్రితమే కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని తాను ప్రభుత్వానికి గుర్తు చేసినా.. ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. హైదరాబాదీల కోసం నిర్మించిన ఈ ప్రపంచ స్థాయి పార్క్ ప్రభుత్వ అసమర్థత కారణంగా సందిగ్ధంలో పడిపోయిందన్నారు. ఇది నిరాశాజనక ప్రభుత్వం అంటూ KTR ట్వీట్ చేశారు.

Similar News

News September 14, 2025

GHMC వెథర్ రిపోర్ట్ @ 10AM

image

జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠం 29.0°C, కనిష్ఠం 22.2°Cగా నమోదైంది.

News September 14, 2025

GDPలో MSMEలు 10% వాటా సాధించాలి: మంత్రి

image

రాష్ట్ర GDPలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) వాటా 10% ఉండేలా తమ ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం గో-నేషనల్- ఎక్స్ పో(GoNat) 2025 5వ ద్వైవార్షిక సదస్సును ప్రారంభించారు. నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.

News September 14, 2025

ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.