News August 13, 2025
యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ – 1 న్యాయనిర్ణితగా కలిగిరి వాసి

నెల్లూరు జిల్లా కలిగిరి అంబేడ్కర్ నగర్‌కు చెందిన గోసాల మహేశ్ బాబు(బాబి) యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ – 1 రిఫరీ(న్యాయనిర్ణేత) గా ఎంపికయ్యారు. గోసాల రామచంద్రయ్య, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు బాబి పేదింటి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరుగు యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్- 1 కి రిఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచలి శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News November 7, 2025
నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?
News November 7, 2025
నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.
News November 6, 2025
రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.


