News August 13, 2025

MBNR: తాను లేరు… కానీ మరో ఎనిమిది మందిలో ఊపిరై నిలిచారు!

image

జీవితం అంతం అయినా.. మరొకరికి జీవం పోసే గొప్ప అవకాశం అవయవదానం. తాను కన్నుమూసినా.. మరో 8 మందికి ప్రాణం పోశాడు రాజాపూర్ మండలానికి చెందిన విస్లావత్ కుమార్. 2020 సెప్టెంబర్ 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో 2 రోజులు పోరాడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయటంతో నేడు మరో 8 మందిలో కుమార్‌ను చూసుకుంటున్నారు.
#నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం

Similar News

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.

News April 18, 2026

భద్రాచలం: శిశువు మృతి కేసులో సూపరింటెండెంట్‌కు నోటీసులా?

image

భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో శిశువు మృతి ఘటన అనంతరం పరిపాలనా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనపై బాధ్యతల స్పష్టత కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజున విధుల్లో ఉన్న సిబ్బంది వ్యవహారంపై ఇప్పటికే వివరణలు కోరినట్టు తెలిసింది. ఘటనకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం.

News April 18, 2026

SRHలోకి సౌతాఫ్రికా పేసర్

image

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.