News April 1, 2024

హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన బాపట్ల ఎస్పీ

image

ఏ.ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కె.వి. సుబ్రహ్మణ్యంని ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు. అనంతరం 40 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. సుబ్రహ్మణ్యంని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు వారి కుటుంబసభ్యుల సమక్షంలో దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Similar News

News March 27, 2026

GNT: ఉపాధి పనులకు లక్ష్యాలు..!

image

గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 30 వేల పనిదినాలు సృష్టించాలనే లక్ష్యం పెట్టారు. పనుల ఎంపికలో ఆమోదం పొందిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒక్కో గ్రామంలో కనీసం 30 పనులు ఒకేసారి కొనసాగించాలని ఆదేశించారు. ఈ నెల 31లోపు మస్టర్లు ముగించాలని గడువు పెట్టారు. వివరాలు యుక్తధారా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.

News March 27, 2026

గుంటూరులో ఆర్టీఈ ప్రవేశాలు పెరుగుదల

image

పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించే ఆర్టీఈ అమలు వేగం పెరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరులోనే 1,708 మందికి అవకాశాలు లభించాయి. లాటరీ విధానంలో పారదర్శకంగా ఎంపిక జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు భరిస్తుంది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

News March 27, 2026

గుంటూరులో కాటన్ కన్సార్టియం ఎన్నికల వేడి

image

ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం ఎన్నికల సందడి గుంటూరులో మొదలైంది. 15 స్థానాల్లో 9 స్థానాలకు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు ప్రారంభమవడంతో అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు ఈసారి పోటీగా మారాయి. పత్తి వ్యాపారంలో కీలకమైన ఈ సంస్థపై ప్యానల్ ఆధిపత్యం కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఏప్రిల్ 6న పోలింగ్ జరగగా, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.