News August 13, 2025

ADB: మనకూ కావాలి యూనివర్సిటీ

image

ADBలో యూనివర్సిటీ లేకపోవడం ఇక్కడి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. HYD, WGL, NZB వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. తెలియని ప్రాంతంలో ప్రైవేటు హాస్టళ్లు, ఇరుకుగదుల్లో అద్దెలు కట్టలేక, తిండికి అవస్థలు పడుతున్నారు. ఏటా ఉమ్మడి ADB నుంచి 25వేల మంది ఇంటర్ పూర్తి చేస్తున్నారు. వర్సిటీ ఉంటే డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు వస్తాయని, PGలో మంచి బోధన అందుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

Similar News

News April 17, 2026

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 17, 2026

16ఏళ్ల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నా: నటి

image

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్‌లో జిమ్‌‌కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్‌లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్‌పై కామెంట్స్ చేశారు.

News April 17, 2026

వేసవిలో తాగునీటి కొరతకు చెక్ పెట్టాలి: కలెక్టర్

image

తాగునీరు, పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) కమిటీతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో చర్చించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నారు.