News August 13, 2025

ADB: ఆ మండలాల పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల వల్ల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉట్నూరు, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, సోనాల మండలాలలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు సంబంధిత మండలాల ఎంఈఓలకు, పాఠశాల ప్రిన్సిపల్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News October 28, 2025

ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

image

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.

News October 27, 2025

తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

image

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.

News October 27, 2025

ADB: పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది: కలెక్టర్

image

పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచనాశక్తి, జ్ఞానం పెరుగుతాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్‌లో ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న విలువైన పుస్తకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.