News August 13, 2025
అచ్చంపేటలో అత్యధిక వర్షపాతం

గత 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. అత్యధికంగా అచ్చంపేటలో 20.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. పెద్దకొత్తపల్లిలో 17.2, అమ్రాబాద్‌లో 15.6, పొదలలో 13.4, చారకొండలో 13.2, ఉప్పునుంతలలో 12.2, కోడేరులో 11.2, పెంట్లవెల్లిలో 12.0, కల్వకుర్తిలో 11.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Similar News
News April 17, 2026
సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!

APలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ప్రజలు se.census.gov.in పోర్టల్‌లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది. ఈనెల 30 వరకూ చేయవచ్చు.
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం RTO కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద రూ.25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనన్నారు.
News April 17, 2026
సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


