News August 13, 2025

అత్యవసర సమయంలో డయల్-100 కు కాల్ చేయండి: సీపీ

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టాలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం ఆందిచాలని పేర్కొన్నారు.

Similar News

News August 13, 2025

భారీ వ‌ర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: పొంగులేటి

image

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వ‌ర్షాలతో జ‌న‌జీవ‌నానికి ఆటంకాలు లేకుండా తక్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయన్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. సీఎం సూచ‌న‌ల‌ మేరకు ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

News August 13, 2025

ఖమ్మం జిల్లాలో 575 మి.మీ వర్షాపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో నేడు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వర్షాపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మధిరలో 66.5 మి.మీ, వేంసూరు 59.2, కూసుమంచి 52.3, బోనకల్ 49.5, ఎర్రుపాలెం 40.7, ముదిగొండ 38.6 మి.మీ. వర్షం పడింది. తక్కువగా సింగరేణిలో 3.4, తల్లాడలో 3.2 మి.మీ. నమోదైంది. మొత్తం 21 మండలాల్లో 575 మి.మీ నమోదైందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News August 13, 2025

ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం ముదిగొండ, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరం, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.