News August 13, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈనెల 18న క్యాబినెట్ భేటీలో చర్చించి CM ప్రకటించే అవకాశం ఉంది. రేపు పంచాయతీ అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. అటు ఎన్నికల నిర్వహణకు గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్సులు HYDకు వచ్చాయి. వాటిని నేడు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
Similar News
News April 19, 2026
RRR నిర్మాణం.. ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr పరిహారం!

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి(D) సదాశివపేట(M) పెద్దాపూర్ పరిధిలోని భూములకు ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr, కనిష్ఠంగా దౌల్తాబాద్ శివారు భూములకు ఎకరానికి ₹16L ఇస్తున్నట్లు సమాచారం. RRR కోసం సంగారెడ్డి CALA పరిధిలో 526 ఎకరాలు అవసరమని NHAI నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వాసితులకు ₹119.50Cr చెల్లించారు.
News April 19, 2026
అప్పులపై రాజధాని.. అలాగే మావిగన్ సరికాదు: విజయసాయిరెడ్డి

AP: రాష్ట్రానికి క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమని YCP మాజీ MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘రూ.లక్షల కోట్లతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై రాజధాని నమూనా సరికాదు. ఏకీకృత, దశలవారీ అభివృద్ధితో నిర్మించాలి. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని అనేది పరిపాలనకు నాడీకేంద్రంగా ఉండాలి. మావిగన్ అంటూ పరిపాలనా విభజన ప్రమాదం. దీంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది’ అని అన్నారు.
News April 19, 2026
భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.


